పోగొట్టుకున్న బ్యాగు అప్పగింత | - | Sakshi
Sakshi News home page

పోగొట్టుకున్న బ్యాగు అప్పగింత

Jun 14 2026 10:31 AM | Updated on Jun 14 2026 10:31 AM

బెల్లంపల్లి: ఆటోలో బ్యాగు పోగొట్టుకున్న వ్యక్తికి టూటౌన్‌ పోలీసులు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్‌ జిల్లా రాఘవపురానికి చెందిన మాదాసి ఐలయ్య శుక్రవారం దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో బెల్లంపల్లికి వచ్చాడు. కల్వరి చర్చికి వెళ్లడానికి మందమర్రి వైపు వెళ్లే ఆటో ఎక్కాడు. చర్చి వద్ద ఆటో దిగి బ్యాగును అందులో మర్చిపోయాడు. త ర్వాత టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యా గులో బ్యాంకు, పట్టాపాసుపుస్తకాలు, పింఛన్‌బుక్‌, ఆధార్‌కార్డు, రూ.2వేలు నగదు ఉన్నట్లు వెల్లడించాడు. స్పందించిన కానిస్టేబుల్‌ బుక్య గంగాధర్‌.. సీసీ పుటేజీలు పరిశీలించి ఆటో మందమర్రికి చెందిన శంకర్‌దిగా గుర్తించాడు. శనివారం అతని ఇంటికి వెళ్లగా బ్యాగును అప్పగించాడు. కానిస్టేబుల్‌తోపాటు ఆటోడ్రైవర్‌కు ఐలయ్య కృతజ్ఞతలు తెలిపాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement