నిర్మల్‌ఖిల్లా: నిర్మల్‌కు చెందిన సంస్కృత భాషా ప్రచార సమితి ఆదిలాబాద్–నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్యకవి బి.వెంకట్‌కు పద్యగాన సత్కారం లభించింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో శనివారం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలుగుభాషా చైతన్య సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అక్కి నర్సింలు గౌడ్ రచించిన బాలరామాయణం పుస్తకావిష్కరణ సభలో నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొన్న డా. బి.వెంకట్ తన స్వీయ పద్యాలను ఆలపించి సభికులను ఆకట్టుకున్నారు. అతిథులుగా పాల్గొన్న ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞశర్మ, తెలంగాణ భాషా చైతన్య సమితి అధ్యక్షులు బడేసాబ్, కుసుమ ధర్మన్న కళాపీఠం చైర్మన్ రాధాకుసుమ, పంచపదుల ప్రక్రియ రూపకర్త పాండురంగ విఠల్ చేతులమీదుగా ఆయన పద్యగాన సన్మానాన్ని స్వీకరించారు. జిల్లాకు చెందిన పలువురు రచయితలు, సాహితీవేత్తలు ఈ సందర్భంగా వెంకట్‌కు అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన కవిసమ్మేళనంలో 51 మంది కవులు పాల్గొన్నారు.


