సాత్నాల: ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి పని నిమిత్తం నాగపూర్ వెళ్తున్న కారు శనివారం భోరజ్ మండలం పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా వద్ద చేరుకుంది. టోల్ తీసుకోవడానికి ఆగి ఉన్న లారీని వెనక నుంచి వేగంగా ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డితోపాటు సనత్ కుమార్‌కు తీవ్రంగా, కుష్బూ నాయుడుకి స్వల్ప గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తులో లారీని ఢీకొన్నట్టు డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపాడు.


