నేరడిగొండ: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందినట్లు ఎస్సై ఇమ్రాన్ తెలిపారు. ఎస్సై, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని యాపల్‌గూడ గ్రామానికి చెందిన మండాడి భీంరావ్(30) శనివారం తన బైక్‌పై బంధువులను వదిలిరావడానికి గుత్పాల గ్రామానికి వెళ్లి తిరిగివస్తున్నాడు. రోల్‌మామడ సమీపంలోని దేవుల్‌నాయక్ తండా వద్ద లారీ రాంగ్‌రూట్‌లో నిర్లక్ష్యంగా రివర్స్ తీసుకుంటూ బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో భీంరావ్ కిందపడి తల, వీపు భాగానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అంబులెన్స్‌లో నిర్మల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్ జగన్‌పై చర్యలు తీసుకోవాలని మృతుడి అన్న కృష్ణ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


