● స్వచ్ఛందంగా ముందుకొస్తున్న దాతలు ● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం
ఏటా జూన్ 14న..
ప్రముఖ జీవశాస్త్రవేత్త, వైద్యుడు కార్ల్ ల్యాండ్ స్టీనర్ 19వ శతాబ్దంలో మానవ రక్తకణాలు కనుగొన్నందు కు గాను 1930లో నోబెల్ బహుమతి లభించింది. ఆయన జయంతి సందర్భంగా ఏటా జూన్ 14న రక్తదాతల దినోత్సవం నిర్వహిస్తోంది.
మంచిర్యాల జిల్లాలో..
జిల్లా కేంద్రం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రం లేదు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ప్రభుత్వ ఆస్పత్రితోపాటు ఇతర ఆస్పత్రులకు సరఫరా చేస్తోంది. 2008 నుంచి ఇప్పటివరకు 1,11,832 యూనిట్లు రక్తదాన శిబిరాల ద్వారా సేకరించి 1,11,639 యూనిట్లు అందజేశారు. 2,500 యూనిట్లు నిల్వ చేసే కోల్డ్‌స్టోరేజీ ఉంది. ప్రతీ నెల సికిల్‌సెల్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు 300 యూనిట్లు ఎక్కిస్తున్నారు. ఓ పాజిటివ్ గ్రూపు రక్తం ఎక్కువగా నిల్వ ఉంటుండగా.. వినియోగమూ ఎక్కువే ఉంటోంది. ప్రస్తుతం ఓ పాజిటివ్ 141 యూనిట్లు, ఓ నెగెటివ్ 6, ఏ పాజిటివ్ 86, ఏ నెగెటివ్ 3, బీ పాజిటివ్ 109, బీ నెగెటివ్ 2, ఏబీ పాజిటివ్ 26, ఏబీ నెగెటివ్ 1 మొత్తంగా 374 యూనిట్లు నిల్వ ఉన్నాయి.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లాలో రెండు ప్రభుత్వ బ్లడ్‌బ్యాంకులు, నిర్మల్ పట్టణంలో మూడు, భైంసాలో ఒక ప్రైవేటు బ్లడ్ బ్యాంకు ఉన్నాయి. రోజు 40 నుంచి 80 మందికి రక్తం అవసరం అవుతుంది. ఇటీవల రోడ్డు ప్రమాద కేసులు గణనీయంగా పెరిగాయి. వీరితోపాటు ప్రసవం, రక్తహీనత కేసులకు దాతల నుంచి రక్తం అవసరం పడుతుంది. జనరల్ ఆస్పత్రిలో 300 యానిట్ల వరకు రక్తం నిల్వ ఉంచవచ్చు. ప్రతీనెలా 200 నుంచి 250 యూనిట్లు అవసరం ఉండటంతో అదేస్థాయిలో సేకరిస్తున్నారు. బ్లడ్ బ్యాంకుల్లో ఒక్కోసారి రక్తనిల్వలు లేకుండా పోతుండడంతో అత్యవసర సమయాల్లో దాతల నుంచి సేకరించాల్సి వస్తోంది. ఏ, బీ, ఓ పాజిటివ్ గ్రూప్‌లను రక్తదాన శిబిరాల్లో ఎక్కువగా రక్తదాతలు ఇస్తారు. ఏ, బీ నెగెటివ్ వేల మందిలో ఒకరు, ఇద్దరు మాత్రమే ఉంటారు.
దాతలకు బీమా పాలసీ
వెయ్యిమందికి పైగా
39 సార్లు చేశా..
పాతమంచిర్యాల /ఆసిఫాబాద్‌అర్బన్/నిర్మల్‌చైన్‌గేట్: రక్తం.. ప్రత్యామ్నాయం లేనిది. కృత్రిమంగా తయారు చేయలేనిది. మనిషిలో ప్రవహించే రక్తం మాత్రమే మనుషుల ప్రాణాలు కాపాడడంలో దోహదపడుతుంది. రక్తం తక్కువగా ఉన్న వారికి సరైన సమయంలో ఎక్కించకపోతే ప్రాణాలు పోయే ప్రమాదముంది. సికిల్‌సెల్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతీ వారం లేదా నెలకోసారి క్రమం తప్పకుండా ఎక్కించాల్సిందే. అలాంటి వారితోపాటు అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారి కోసం కొందరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి దానం చేస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.


