ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసిన మహిళ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసిన మహిళ అరెస్టు

Jun 14 2026 10:31 AM | Updated on Jun 14 2026 10:31 AM

● వెల్లడించిన ఎస్పీ అఖిల్‌మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన మహిళను అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. శనివారం ఈమే రకు వివరాలు వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో ఏజెంట్ల ద్వారా ప్ర భుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని వందల మంది అభ్యర్థులను మోసం చేసిన ముఠాసభ్యుల్లో ఒకరైన సుజాత ఠాకూర్‌ను వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చే శారు. జిల్లావ్యాప్తంగా ఈ ముఠా సభ్యులపై 20 కే సులకు పైగా నమోదైంది. ప్రధాన నిందితులను జ నవరి 10న రిమాండ్‌కు తరలించగా తాజాగా సుజా త ఠాకూర్‌ను అరెస్టు చేశారు. నిందితులు 2023లో అనంత ఈ సొల్యూషన్స్‌, విద్యాదాన్‌ ఆర్గనైజేషన్‌ అనే సొసైటీ ద్వారా విద్యాంజలి 2.0 స్కీం డబ్బులు దుర్వినియోగం చేయాలని పన్నాగం పన్నారు. కేంద్రప్రభుత్వం ద్వారా వచ్చే సీఎస్‌ఆర్‌ నిధులు కాజేయాలని దురుద్దేశంతో ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని అబద్ధాలు చెప్పి నిరుద్యోగులను నమ్మించారు. నకిలీ ఉద్యోగాలను పాఠశాలలు, కళాశాలల్లో వచ్చేలా చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు ఎస్పీ తెలిపారు. ఈ ముఠా సభ్యులు ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష నుంచి రూ.2.50 లక్షల లక్షల వరకు వసూళ్లు చేసి దాదాపు 240 అభ్యర్థులను మోసం చేసినట్లు వివరించారు. ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారి మాటలను నమ్మవద్దని అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. డబ్బులతో ప్రభుత్వ ఉద్యోగాలు రావని పరీక్షల ద్వారా ఉద్యోగాలను సాధించాలని తెలిపారు. నిరుద్యోగులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement