రెండెకరాలే ‘భరోసా’! | - | Sakshi
Sakshi News home page

రెండెకరాలే ‘భరోసా’!

Jun 13 2026 1:11 PM | Updated on Jun 13 2026 1:11 PM

● పూర్తి స్థాయిలో అందని వైనం ● ఖరీఫ్‌ సీజన్‌ పెట్టుబడికి ఇబ్బందులు

మంచిర్యాలఅగ్రికల్చర్‌: వానాకాలం సాగు సీజన్‌ ప్రారంభమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరిట అందించే పంట పెట్టుబడి సాయం రెండెకరాలకే పరిమితం కావడంతో రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. మిగతా సాయం అందుతుందా లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది. మరోవైపు పంటల సాగుకు సంబంధించి ప్రభుత్వం విత్తనాలు, ఎరువుల వినియోగంపై సమావేశాలు నిర్వహిస్తోంది. యాసంగి సీజన్‌ రైతు భరోసా మొదటి విడత గత మార్చి 22న ప్రభుత్వం ఎకరానికి రూ.6వేల లెక్కన ఎకరంలోపు వారికి విడుదల చేసింది. రెండో విడత 20 రోజుల తర్వాత, మూడో విడత ఏప్రిల్‌ చివరలో జమ చేస్తామని ప్రకటించింది. ఏప్రిల్‌ 23న రెండో విడత రెండెకరాల్లోపు రైతులకు అందజేసింది. మొత్తంగా రెండెకరాల్లోపు రైతులకు 12వేలు జమ చేసింది. జిల్లాలోని 1,56,034 మంది రైతుల ఖాతాల్లో రూ.125.95 కోట్లు జమయ్యాయి. రైతు భరో సా అందజేయాలని రైతులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement