విద్యారంగానికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

విద్యారంగానికి ప్రాధాన్యం

Jun 13 2026 1:11 PM | Updated on Jun 13 2026 1:11 PM

బెల్లంపల్లి/తాండూర్‌: విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని బెల్లంపల్లి ఎమ్మెల్యే జి.వినోద్‌ అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని రాంగనగర్‌ బస్తీలో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి ప్రారంభించారు. వార్డుల్లో రూ.1.44కోట్ల అంచనాతో నిర్మించనున్న రోడ్లకు శంకుస్థాపన చేశారు. పట్టణంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. తాండూర్‌లో మహాత్మాజ్యోతిబాపూలే వసతిగృహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్‌, ప్రహరీలు, మూత్రశాలల నిర్మాణాలతోపాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దావ స్వాతి, సర్పంచ్‌ ముడిమడుగుల సురేష్‌, తహసీల్దార్‌ జ్యోత్స్న, ఎంపీడీఓ శ్రీనివాస్‌, ఆర్సీఓ బాలభాస్కర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement