లక్సెట్టిపేట: కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగిన వివాహిత చికిత్సపొందుతూ మృతిచెందింది. ఎస్సై గోపతి సురేష్ తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని దౌడపల్లి గ్రామానికి చెందిన అడప ఉమ (51), శ్రీనివాస్ దంపతులు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఉమ గత నాలుగేళ్లుగా కడుపు, నడుము నొప్పితో బాధపడుతోంది. ఆసుపత్రుల్లో చూపించుకున్నా నయం కాలేదు. ఈనెల 10న కడుపునొప్పి అధికం కావడంతో భరించలేక ఇంట్లో పురుగుల మందు తాగింది. కుటుంబీకులు గమనించి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కరీంనగర్ తరలించగా చికిత్సపొందుతూ గురువారం రాత్రి మృతిచెందింది. భర్త ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


