‘మోదీ పాలనలోనే దేశం అభివృద్ధి’ | - | Sakshi
Sakshi News home page

‘మోదీ పాలనలోనే దేశం అభివృద్ధి’

Jun 12 2026 5:51 AM | Updated on Jun 12 2026 5:51 AM

మంచిర్యాలటౌన్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలోనే దేశం అభివృద్ధి చెందుతోందని, సంక్షేమం దిశగా పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానిగా మోదీ తన 12ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్నారని, అత్యధిక రోజులు ప్రధానిగా రికా ర్డును సృష్టించారని అన్నారు. మంచిర్యాల అమృత్‌ భారత్‌ రైల్వేస్టేషన్‌ అభివృద్ధి కేంద్రం చేపడుతోందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో రా బోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధి కారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌, నాయకులు గా జుల ముఖేష్‌గౌడ్‌, దుర్గం అశోక్‌, ఎనగందుల కృష్ణమూర్తి, వంగపల్లి వెంకటేశ్వర్‌రావు, తుల ఆంజనేయులు, పెద్దపల్లి పురుషోత్తం, కస్తూరి నాగరాజు, బొట్ల అనిత, సంజీవరావు, పట్టి వెంకటకృష్ణ, వైద్య శ్రీధర్‌, అమిరిశెట్టి రాజ్‌కుమార్‌, కుర్రె చక్రవర్తి, మోటపలుకుల తిరుపతి, బెల్లంకొండ మురళి, డేగ బాపు, మోతె సుజాత, నాంపల్లి శ్రీనివాస్‌, కమలాకర్‌రావు, కర్రె లచ్చన్న పాల్గొన్నారు.

మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement