విచారణ పారదర్శకంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

విచారణ పారదర్శకంగా నిర్వహించాలి

Jun 12 2026 5:51 AM | Updated on Jun 12 2026 5:51 AM

కాసిపేట: ఫిర్యాదులపై తక్షణమే స్పంది స్తూ విచారణ పారదర్శకంగా నిర్వహించాలని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా సూచించారు. గురువారం మండలంలోని దేవాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలు పరిశీలించి రిసెప్షన్‌, పోలీసు సిబ్బంది పనితీరుపై సమీక్షించారు. రికా ర్డులు, కేసుల వివరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు నమ్మకం, భరోసా కల్పిస్తూ అండగా నిలువాలని తెలిపారు. ప్రతీ కానిస్టేబుల్‌ తమ పరిధిలోని గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి ప్రజల స మస్యలు తెలుసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవాపూర్‌ ఎస్సై గంగారాం, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement