పనుల్లో వెనుకబడి | - | Sakshi
Sakshi News home page

పనుల్లో వెనుకబడి

Jun 12 2026 5:51 AM | Updated on Jun 12 2026 5:51 AM

● ఊసేలేని మన ఊరు–మన బడి పనులు ● కొనసాగు..తున్న ‘అమ్మ ఆదర్శ’ పనులు ● మంచిర్యాల జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలో మరుగుదొడ్లు, తాగునీటి కుళాయిలు, డైనింగ్‌ హాల్‌ పనులు పది శాతం మేర మిగిలిపోయా యి. పూర్తి చేస్తే విద్యార్థులకు సౌకర్యంగా మారుతుంది. ● హమాలీవాడ పాఠశాలలో అదనపు గది నిర్మా ణం నాలుగేళ్లుగా నిలిచిపోవడంతో విద్యార్థుల కు వరండాలో చదువులు తప్పడం లేదు. వంటగది, అదనపు గదుల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. ● లక్సెట్టిపేట మండలంలో నిధులు మంజూరైనా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టలేదు. మోదెల, తలమల గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలకు డీఎంఎఫ్‌టీ నిధులు రూ.40 వేల చొప్పున మంజూరయ్యాయి. మెదెలలో పనులు ప్రారంభం కాగా, తలమలలో పనులు చేపట్టలేదు.

మంచిర్యాలఅర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. మన ఊరు–మన బడి పనులు అసంపూర్తిగా నిలిచిపోగా.. అమ్మ ఆదర్శ పాఠశాల పనులు కొనసాగుతూ ఉన్నాయి. 2022–23లో చేపట్టిన మన ఊరు–మన బడి పనులపై ఊసే లేకపోగా.. బిల్లులు రాక కాంట్రాక్టర్ల అనాసక్తితో పనులు నిలిచిపోయాయి. 245 బడుల్లో పనులకు కలెక్టర్‌ ఆమోదం లభించగా.. మొదట్లో పనులు చక చక సాగినా ఆ తర్వాత 123 పాఠశాలల్లో పనులు ముందుకు సాగడం లేదు. పది శాతం మేర పనులు పూర్తి చేస్తే వినియోగంలోకి వచ్చే అవకాశాలున్నాయి. రూ.24 కోట్ల 26లక్షల 33వేలు విలువైన పనులు చేసినట్లు మెజర్‌మెంటు బుక్‌(ఎంబీ) న మోదు చేయగా.. రూ.18కోట్ల 53లక్షల 96వేలు చెల్లించినట్లు తెలుస్తోంది. పెండింగ్‌ బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలల్లో రూ.21కోట్ల 58లక్షల 70వేలతో పనులు పనులు చేపట్టారు. 545 పాఠశాలల్లో 476 పనులు పూర్తి చేశారు. తాగునీరు, మరుగుదొడ్లు, విద్యు త్‌ సౌకర్యం, చిన్న మరమ్మతులు సాగుతున్నాయి. 69 పాఠశాలల్లో పనులు ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. దాదాపు 210 పాఠశాలల్లో ప్రహరీ, 280కు పైగా వంట గదుల నిర్మాణం చేపట్టాల్సి ఉంది.

గదుల కొరత

మంచిర్యాల జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న స్టేషన్‌రోడ్‌ పాఠశాలలో గదుల కొరత ఉంది. మూడు గదులు ఉండగా.. నలుగురు ఉపాధ్యాయులు ఐదు తరగతులకు బోధిస్తున్నారు. ఇటీవల ప్రీప్రైమరీ పాఠశాల మంజూరు కాగా ప్రవేశాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే గదిలో విద్యార్థులు ఇరుకుగా కూర్చుని చదువుకుంటుండగా.. ప్రీ ప్రైమరీ విద్యార్థులను ఎక్కడ కూర్చోబెట్టాలో తెలియని పరిస్థితి. సైన్స్‌ సెంటర్‌పై ఖాళీగా ఉన్న యువజన క్రీడాధికారి, వయోజన విద్య కార్యాలయాల గదులను కేటాయిస్తే విద్యార్థులకు ప్రయోజనకరంగా మారుతుంది. మండల విద్యావనరుల కేంద్రం భవనంలో స్పోర్ట్స్‌ పేరిట గదిని ఖాళీగా ఉంచారు. నూతనంగా నిర్మిస్తున్న భవనం త్వరగా పూర్తి చేస్తే భవిత కేంద్రం గది కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. భవిత సెంటర్‌ పూర్తి చేస్తే అక్కడ ఓ గదిలో ప్రీప్రైమరీ, జిల్లా సైన్స్‌ సెంటర్‌పై రెండు గదులు అప్పగిస్తే విద్యార్థులకు సౌకర్యంగా మారనుంది.

నస్పూర్‌/లక్సెట్టిపేట: నస్పూర్‌లోని సంఘం మల్ల య్యపల్లి ఎంపీపీఎస్‌లో వంటగది అసంపూర్తిగా ఉంది. మోటార్‌ బిగించకపోవడంతో బోర్‌వెల్‌ నిరుపయోగంగా మారింది. కేజీబీవీ లో డైనింగ్‌ హాల్‌, అదనపు తరగతి గదుల ని ర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆవరణ లో పిచ్చిమొక్కలు పెరిగి ట్రాన్స్‌ఫార్మర్‌ ప్రమాదకరంగా ఉంది.

మంచిర్యాలలోని హమాలీవాడలో నిలిచిన అదనపు తరగతి గదుల నిర్మాణం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement