ఓటర్ల పేర్ల తొలగింపును అడ్డుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఓటర్ల పేర్ల తొలగింపును అడ్డుకోవాలి

Jun 12 2026 5:51 AM | Updated on Jun 12 2026 5:51 AM

జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి ఓటర్ల సవరణపై బూత్‌ స్థాయి ఏజెంట్లకు అవగాహన పాల్గొన్న ఎంపీలు వంశీకృష్ణ, సురేష్‌షెట్కర్‌

రామకృష్ణాపూర్‌: ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని, ‘సర్‌’ ముసుగులో ఓటర్ల తొలగింపునకు జరుగుతున్న కుట్రలను బూత్‌ స్థా యి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి తిపికొట్టాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి పిలుపునిచ్చారు. క్యాతనపల్లి ము న్సిపాలిటీలోని ఎంఎన్‌ఆర్‌ గార్డెన్స్‌లో గురువారం ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా(ఎస్‌ఐఆర్‌)పై బూ త్‌ స్థాయి ఏజెంట్ల అవగాహన కార్యక్రమంలో మంత్రి వివేక్‌వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌ షెట్కర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్‌ మాట్లాడు తూ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్లను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ప్రభుత్వం ‘సర్‌’ పేరుతో కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఏజెంట్లు ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలను బలహీనపర్చడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం ఓటర్ల పేర్ల తొలగింపునకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ వేస్తే తిరస్కరించి ప్రజాస్వామ్య విలువలను బీజేపీ పాతర వేసిందని విమర్శించారు. నీట్‌లో జరిగిన అవకతవకలు, పేపర్‌ లీకేజీల వల్ల విద్యార్థుల భవిష్యత్‌ ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌ షెట్కర్‌ మాట్లాడుతూ ఓటరు జాబితాలో పేరు భద్రంగా ఉండేలా బూత్‌ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీడ్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అన్వేష్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement