చెన్నూర్‌ నియోజకవర్గంలో.. | - | Sakshi
Sakshi News home page

చెన్నూర్‌ నియోజకవర్గంలో..

Jun 12 2026 5:51 AM | Updated on Jun 12 2026 5:51 AM

● చెన్నూర్‌ మండలం ఎల్లక్కపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రహరీకి గేట్లు ఏర్పాటు చేయలేదు. పశువులు, బయటి వ్యక్తులు పాఠశాల ఆవరణలోకి వెళ్తున్నారు. వంటషెడ్డు నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. బోరు ఏర్పాటు చేసినా విద్యుత్‌మోటారు అమర్చలేదు. ● కోటపల్లి మండలం పార్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో నల్లాలకు నీటి సౌకర్యం కల్పించలేదు. మూత్రశాలల పనులు పూర్తి కాలేదు. వంటగది అసంపూర్తిగానే ఉంది. నాగంపేట ప్రాథమిక పాఠశాలలో మూత్రశాలలకు నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు. శివరాంపల్లి, నందరాంపల్లి, సుపాక(ఓ), సుపాక(కే)కు డీఎఫ్‌ఎంటీ నిధులు మంజూరైనా పనులు అసంపూర్తిగానే ఉన్నాయి.

చెన్నూర్‌/చెన్నూర్‌రూరల్‌/మందమర్రిరూరల్‌/కోటపల్లి: చెన్నూర్‌ పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల, ప్రాథమిక పాఠశాలలో మన ఊరు–మన బడి కార్యక్రమంలో భాగంగా ఐదు తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. రెండేళ్లయినా పనులు ముందుకు సాగలేదు. విద్యార్థుల్లో ఇరుకు గదుల్లో పాఠాలు వినాల్సిన దుస్థితి నెలకొంది. హరిజనవాడ ప్రాథమిక పాఠశాల ప్రహరీ కూలిపోయింది. మందమర్రి మండలం చిర్రకుంట గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.2లక్షలు కేటాయించి టెండర్‌ పిలిచినా ఎవరూ ముందుకు రావడం లేదు.

కోటపల్లి: పార్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న కుళాయిలు

చెన్నూర్‌: జిల్లా పరిషత్‌ బాలికల పాఠశాలలో పూర్తి కాని తరగతి గదులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement