బెల్లంపల్లి: బెల్లంపల్లిలో అమృత్ 2.0 పనులు ఆలస్యం చేయకుండా సత్వరంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని ఎమ్మెల్యే జి.వినోద్ అన్నారు. గురువారం బెల్లంపల్లి కన్నాల గ్రామ శివారులో అమృత్ 2.0 అభివృద్ధి పనులను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్యతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, కాంగ్రెస్ నాయకులు కారుకూరి రాంచందర్, దావ రమేష్‌బాబు, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ప్రజల భద్రత.. జీవాల రక్షణ ఎంతో ముఖ్యం
బెల్లంపల్లి: ప్రజల భద్రత, జీవాల రక్షణ ఎంతో ముఖ్యమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. గురువారం బెల్లంపల్లి అటవీ శాఖ కార్యాలయం ఆవరణలో ర్యాపిడ్ రెస్క్యూ టీమ్(ఆర్‌ఆర్‌టీ) భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి, జంతు ఘర్షణలను తగ్గించడంలో టీమ్ సభ్యులు ముందుండాలని తెలిపారు. అటవీ సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. అనంతరం అటవీ శాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీవో విజయ్‌కుమార్, ఎఫ్‌ఆర్‌వో పూర్ణచందర్, డెప్యూటీ ఎఫ్‌ఆర్‌వో గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.


