మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల బలోపే తం, విద్యార్థుల నమోదు పెంపు, విద్యావిశిష్టతను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో రచించిన పాత మంచిర్యాల ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆడిచర్ల సాగర్ సర్కారు బడికి పోదాం పదా పాట యూట్యూబ్‌లో అలరిస్తోంది. కృతిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతను వినియోగించి రూపొందించిన బడి పాట వీడియో ఆలోచింపజేస్తోంది. గురువారం ఫోరం ఫర్ సోషల్ కన్సర్న్ రాష్ట్ర చైర్మన్ పర్వతి సత్యనారాయణ ఆన్‌లైన్ ద్వారా అవిష్కరించారు. సర్కారు బడికి పోదాం పదా..పిల్లలకు అమ్మ బడి కదా..స్వేచ్ఛా స్వాతంత్య్రాల లోగిలి.. వారి మనుసుకు అది జాబిలి అంటూ వీడియో చిత్రీకరణ చూపరులను కట్టిపడేస్తోంది. తల్లిదండ్రుల తర్వాత జ్ఞానపు జ్యోతులు వెలిగించే ఉపాధ్యాయుల పిల్లల జీవితాల్లో కీలకపాత్ర వారిదే అంటూ సాగిన పాట ఆలోచింపజేస్తోంది.


