కస్టడీలో ఉన్న ధాన్యం లారీ వదిలేయాలి | - | Sakshi
Sakshi News home page

కస్టడీలో ఉన్న ధాన్యం లారీ వదిలేయాలి

Jun 12 2026 5:51 AM | Updated on Jun 12 2026 5:51 AM

● ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ● జాతీయ రహదారిపై నిలిపిన ఐదు లారీలు

కోటపల్లి: మండలంలోని రాపన్‌పల్లి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు మీదుగా ధాన్యం తరలిస్తున్న ఆరు లారీలను అధికారులు పట్టుకున్నారు. కాని ఒక్కలారీని వదిలేయాలని ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం రాత్రి మహారాష్ట్ర నుంచి ధాన్యపు లారీలు మధ్యప్రదేశ్‌ వెళ్తుండగా చెక్‌పోస్టు వద్ద అధికారులు తనిఖీ చేశారు. మహారాష్ట్ర రాజ్య ఆదివాసీ వికాస్‌ పేరిట టెండర్‌ వేసి ఆరు లారీలతో ధాన్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కటి మాత్రమే పోలీసు కస్టడీ అప్పగించి మిగిలినవి జాతీయ రహదారిపై నిలిపివేశారు. అయితే కస్టడీలో ఉన్న లారీని వదిలేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఒక్క ధాన్యం లారీని మహారాష్ట్ర(కే) పంపేలా గురువారం రాత్రి ఆదేశాలు జారీ అయింది. వాహనాలపై ఎలాంటి కేసులు లేకుండా పంపడం కొసమెరుపు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement