లక్ష్మణచాంద: మండలంలోని పార్‌పెల్లి–ధర్మా రం గ్రామాల మధ్య రెండు బై కులు ఎదురెదురుగా ఢీకొని ము గ్గురికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం నాగాపూర్‌కు చెందిన ఓరుగంటి నర్సయ్య(65) భార్య సునీత(45) పుట్టింటి వారు ధర్మారం పోచమ్మ వద్ద పండుగ చేస్తున్నారని గురువారం పార్‌పెల్లికి బైక్‌పై వ స్తున్నారు. పార్‌పెల్లికి చెందిన కందుకూరి హ రీశ్(35) ధర్మారం పోచమ్మ ఆలయానికి వెళ్లేందుకు బైక్‌పై వస్తుండగా ఎదురెదురుగా ఢీకొ న్నాయి. ఈప్రమాదంలో నర్సయ్య తలకు తీవ్ర గాయాలు కాగా, సునీత స్వల్పంగా, హరీశ్ తలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పైలట్ నవీన్‌కుమార్, ఈఎంటీ దీపక్‌లు క్షతగాత్రులను అంబులెన్స్‌లో నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించారు. నర్సయ్యకు మెరుగైన వైద్యం నిజామాబాద్‌కు పంపించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. హరీశ్, సునీతలు నిర్మల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓరుగంటి నర్సయ్య బావ మేడిపెల్లి నర్సయ్య ఫిర్యాదుతో హరీశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రావణి తెలిపారు.


