ట్రాక్టర్లను ఢీకొట్టిన లారీ | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్లను ఢీకొట్టిన లారీ

Jun 12 2026 5:51 AM | Updated on Jun 12 2026 5:51 AM

తాండూర్‌: రెండు ట్రాక్టర్లను లారీ ఢీకొట్టిన ఘటన మండలంలోని బోయపల్లి బోర్డు సమీపంలో జాతీ య రహదారిపై చోటుచేసుకుంది. ఎస్సై ప్రసాద్‌రావు కథనం ప్రకారం.. తాండూర్‌ గ్రామం బోయవాడకు చెందిన ముస్కె రాజశేఖర్‌(19), బొల్లి తిరుపతి ఇద్దరు రెండు ట్రాక్టర్లపై బుధవారం అర్ధరాత్రి సమయంలో మంచిర్యాలలోని ఇసుక రీచ్‌కు ఇసుక తీసుకువచ్చేందుకు వెళ్తున్నారు. ఆసిఫాబాద్‌ నుంచి మంచిర్యాలకు వెళ్తున్న లారీ వేగంగా ఈ రెండు ట్రాక్టర్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముస్కె రాజశేఖర్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో ట్రాక్టర్‌ డ్రైవర్‌ తిరుపతి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతుడి తండ్రి ముస్కె రాజలింగు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement