ఆపన్నహస్తం అందించరూ.. | - | Sakshi
Sakshi News home page

ఆపన్నహస్తం అందించరూ..

Jun 12 2026 5:51 AM | Updated on Jun 12 2026 5:51 AM

ఖానాపూర్‌: మండలంలోని బావాపూర్‌ (కె) గ్రామానికి చెందిన గడుగు శ్రీనివాస్‌ విద్యుత్‌ షాక్‌కు గురై గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. వైద్యఖర్చులు రూ.లక్షల్లో ఖర్చువుతుండడంతో బాధిత కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. ఈనెల 3న గ్రామంలో గాలిదుమారంతో కూడిన వర్షం కురవడంతో పలుచోట్ల స్తంభాలు కూలిపోయి, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. సరఫరా పునరుద్ధరించే పనుల్లో భాగంగా మరమ్మతు నిర్వహిస్తుండగా శ్రీనివాస్‌ ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆయన కుడిచేతితోపాటు కాలి వేళ్లను కోల్పోయాడు. హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో ఆయన వైద్యానికి కుటుంబీకులు ఇప్పటికే సుమారు రూ.10 లక్షలు వెచ్చించారు. చికిత్సకు ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్నాయని దాతలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆర్థికసాయం అందించాలని కోరుతున్నారు. సాయం చేయదలిచిన వారు గడుగు శ్రీనివాస్‌ సెల్‌ నంబర్‌ 97040 24138 నంబర్‌లో సంప్రదించవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement