కార్మికుల పెన్షన్‌ పెంచాలని వినతి | - | Sakshi
Sakshi News home page

కార్మికుల పెన్షన్‌ పెంచాలని వినతి

Jun 12 2026 5:51 AM | Updated on Jun 12 2026 5:51 AM

శ్రీరాంపూర్‌: బొగ్గు గని కార్మికుల పెన్షన్‌ పెంచాలని సింగరేణి రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులు కోరారు. గురువారం హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన సమావేశానికి హాజరైన కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిగిన ధరలకు వస్తున్న పెన్షన్‌ సరిపోవడం లేదన్నారు. కనీసం పెన్షన్‌ పెంపుదల చేసి ఆర్థిక భద్రత కల్పించాలన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు వైద్య చికిత్స అందించే సీపీఆర్‌ఎంఎస్‌ కార్డు పరిమితి పెంచాలని కోరారు. వైద్య బిల్లుల రీయింబర్స్‌మెంట్‌ సులభతరం చేయాలని, ఇంకా ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. కేంద్ర బొగ్గు సహాయక శాఖ మంత్రి చంద్రు దుబే, సింగరేణి డైరెక్టర్‌ (పర్సనల్‌) గౌతమ్‌కు ఈమేరకు వినతిపత్రాలు అందజేశారు. అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఏ.వేణుమాధవ్‌, ఉపాధ్యక్షుడు కంచ బీరయ్య, కోశాధికారి విజయబాబు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement