అర్హులైన కుటుంబాలకు సంక్షేమ ఫలాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులైన కుటుంబాలకు సంక్షేమ ఫలాలు

Jun 11 2026 7:53 AM | Updated on Jun 11 2026 7:53 AM

● రాష్ట్ర కార్మిక మంత్రి వివేక్‌వెంకటస్వామి ● కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ

చెన్నూర్‌: అర్హులైన ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామని రాష్ట్ర కార్మిక, మైనింగ్‌ శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. బుధవారం ఆయన చెన్నూర్‌లో వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించి, పాత మార్కెట్‌ కార్యాలయంలో బస్తీ దవాఖానాను ప్రారంభించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెద్దింటి పద్మ బీపీ చెక్‌ చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, అదనపు కలెక్టర్‌ చంద్రయ్యతో కలిసి చెక్కులు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం వైద్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు బస్తీ దవాఖానాను ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ మల్లికార్జున్‌, వైద్యులు సత్యనారాయణ, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పెద్దింటి పద్మ, వైస్‌ చైర్మన్‌ వినయ్‌కుమార్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

జర్మన్‌ భాష నేర్చుకుని ఉద్యోగాలు పొందండి

మందమర్రిరూరల్‌: నిరుద్యోగ యువత జర్మన్‌ భాష నేర్చుకుని ఆ దేశంలో ఉద్యోగావకాశాలు పొందాలని రాష్ట్ర మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. మందమర్రి పట్టణంలోని ఇల్లందు క్లబ్‌ ఆవరణలో బుధవారం తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపనీ లిమిటెడ్‌, ఉపాది, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జర్మన్‌ భాష శిక్షణ కేంద్రాన్ని కమిషన్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ కాంతి వెస్లీ, అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములు, జాయింట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ రేఖారాణి, జాయింట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ రమేష్‌బాబు, డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ నాగభారతి, ఏరియా జీఎం రాధాకృష్ణ తదితరులతో కలిసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ శిక్షణలో 112 మంది యువకులు ఉన్నారని, మూడు నెలలపాటు శిక్షణ కాలంలో కాకా వెంకటస్వామి ఫౌండేషన్‌ ద్వారా రూ.1000 స్టైఫండ్‌ అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజినల్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ రాము, జిల్లా ఎంప్లాయిమెంట్‌ అధికారి రవికృష్ణ, తహసీల్దార్‌ సతీష్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాజలింగు, డీజీఎం(పర్సనల్‌) అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement