మంచిర్యాలఅగ్రికల్చర్: పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ డిమాండ్ చేశారు. ధరలు నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతూ పేదల నడ్డి విరుస్తోందని విమర్శించా రు. బీజేపీ పాలనలో సామాన్యుల బతుకు భారంగా మారిందని అన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు, చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, పూర్ణిమ, వీరభద్రయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు నగేష్, సుదర్శన్, శ్రీనివాస్, మల్లేష్, రవి, చంద్రకళ, రాజమొగిలి, కొండు బానేష్, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.


