● బానిసైన వారు బాధితులు మాత్రమే ● మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్
మంచిర్యాలక్రైం: యుద్ధ ప్రాతిపదికన డ్రగ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిషాముక్త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ డ్రగ్స్ నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో పోలీసు వ్యవస్థలో నార్కొటిక్ టీమ్ ఏర్పాటైనట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 30 మందికి డీ అడిక్షన్ సెంటర్‌లో వైద్యం అందించి డ్రగ్స్ నుంచి విముక్తి కల్పించామని తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో వారిని బాగు చేసేందుకు అన్ని విధాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. డ్రగ్స్‌కు బానిసైన వారిని నేరస్తులుగా పరిగణనలోకి తీసుకోబోమని, బాధితులుగా చూసి రక్షించడమే ప్రధాన కర్తవ్యంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తోందని తెలిపారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. గంజాయి, మద్యం, ఇతర డ్రగ్స్‌కు బానిసైన వారి వివరాలు డయల్ 100 ద్వారా తెలియజేయాలని అన్నారు. అనంతరం డ్రగ్స్ వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, ఆసుపత్రి ఆర్‌ఎంఓలు భీష్మ, శ్రీధర్, డీఅడిక్షన్ సెంటర్ వైద్యుడు రామునాయక్, రెడ్ క్రాస్‌సొసైటీ సభ్యులు మధుసూదన్‌రెడ్డి, సీఐ ప్రమోద్‌రావు, ఎస్సై మధుసూదన్ పాల్గొన్నారు.


