‘సర్‌’ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి

Jun 11 2026 7:53 AM | Updated on Jun 11 2026 7:53 AM

● పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించాలి ● అదనపు కలెక్టర్‌ రాములు

తాండూర్‌: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాములు సూచించారు. బుధవారం ఆయన స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై సమీక్షించారు. ఈ నెల 25 నుంచి మూడో విడత ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని తెలిపారు. బూత్‌ స్థాయి అధికారులు ప్రతీ ఇంటికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, సూపర్‌వైజర్లు, ఏఈఆర్‌ఓలు పనుల పురోగతిని పరిశీలించాలని అన్నారు. భూ భారతి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించి ఆమోదించాలని తెలిపారు. తహసీల్దార్‌ జ్యోత్స్న, డిప్యూటీ తహసీల్దార్‌ కల్పన, రెవె న్యూ ఇన్‌స్పెక్టర్లు పద్మజ, మురళీధర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement