వెదురు కళాకృతులు అద్భుతం | - | Sakshi
Sakshi News home page

వెదురు కళాకృతులు అద్భుతం

Jun 11 2026 7:53 AM | Updated on Jun 11 2026 7:53 AM

జన్నారం: వెదురుతో గిరిజన మహిళలు తయా రు చేసిన కళాకృతులు అద్భుతంగా ఉన్నాయని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ అన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో బుధవారం జన్నారం అటవీ డివిజన్‌ ఇందన్‌పల్లిలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యాలయ ఆవరణలో జిల్లా అటవీ అధికారి రాహుల్‌కిషన్‌ జాదవ్‌తో కలిసి మొక్కలు నాటారు. గిరిజన మహిళలు తయారు చేసిన వెదురు ఉత్పత్తులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కవ్వాల్‌ వెదురు ఉత్పత్తుల శిక్షణ కేంద్రంలో నిరుద్యోగులు జీవనోపాధి పొందాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఇసుకపై ఆంక్షలు లేకుండా చూడాలని అధికారులకు సూచించా రు. ఈ సమావేశంలో ఎఫ్‌డీవో రామ్మోహన్‌, రేంజ్‌ అధికారి లక్ష్మీనారాయణ, మార్కెట్‌ కమి టీ చైర్మన్‌ లక్ష్మీనారాయణ, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నందునాయక్‌, జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇసాక్‌, కార్యదర్శి ముజాఫర్‌ అలీఖాన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement