కారు, లారీపై పడిన వృక్షం | - | Sakshi
Sakshi News home page

కారు, లారీపై పడిన వృక్షం

Jun 11 2026 7:53 AM | Updated on Jun 11 2026 7:53 AM

ఉట్నూర్‌రూరల్‌: మండలంలోని హర్కాపూర్‌ సమీపంలో బుధవారం ఒక ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ప్రధాన రహదారి పక్కన ఉన్న ఒక భారీ వృక్షం ఒక్కసారిగా ప్రయాణిస్తున్న కారు, లారీపై పడింది. ప్రమాదంలో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూర్‌ –ఆదిలాబాద్‌ ప్రధాన రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు గుర్తుతెలియని వ్యక్తులు మంటలు పెట్టారు. దీంతో ఆ చెట్టు లోపల పూర్తిగా కాలిపోయి, బలహీనపడి ఒక్కసారిగా రోడ్డుపై కూలిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక లారీ, కారుపై ఆ భారీ వృక్షం పడింది. అడ్డుగా లారీ ఉండడంతో కారులో ఉన్న వారికి పెద్ద ప్రమాదం తప్పింది. బాధ్యతారాహిత్యంగా చెట్లకు మంటలు పెట్టడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement