దస్తురాబాద్: అగ్ని ప్రమాదంలో గడ్డివాము దగ్ధమైన ఘటన బుధవారం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుట్టాపూర్ గ్రామ పంచాయతీలోని చెన్నూర్ గ్రామానికి చెందిన దాసరి సుధాకర్ పశువుల మేత కోసం ఇంటి పరిసర ప్రాంతంలో గడ్డి నిల్వ చేశారు. ప్రమాదవశాత్తు గడ్డికట్టలకు నిప్పు అంటుకోగా స్థానికులు గమనించి మంటలు అర్పే ప్రయత్నం చేశారు. హుటాహుటిన జన్నారంలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా సకాలంలో ఫైర్ ఇంజన్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో 3వేల వరకు గడ్డి కట్టలు అగ్నికి అహుతయ్యాయని బాధిత రైతు వాపోయాడు.


