ఆటోలో పాము.. కిందకు దూకిన కూలీలు | - | Sakshi
Sakshi News home page

ఆటోలో పాము.. కిందకు దూకిన కూలీలు

Jun 11 2026 7:53 AM | Updated on Jun 11 2026 7:53 AM

కోటపల్లి: ప్రయాణిస్తున్న ఆటోలో పాము కన్పించడంతో ఉపాధిహా మీ కూలీలు కిందికి దూకి గాయాలపాలైన ఘటన మండలంలోని ఎదులబంధం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఉపాధిహామీ పనుల కోసం గ్రామ శివారుకు కూలీలు ఆటోలో వెళ్లారు. పనులు ముగించుకొని తిరిగి వస్తుండగా ఆటోలో ఒక్కసారిగా పాము కన్పించింది. దీంతో భయాందోళన చెందిన రెవెల్లి శ్రీనివాస్‌, కొనగిరి తిరుపతి, మల్ల న్నలు కిందకు దూకారు. దీంతో వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా అక్కడకు చేరుకున్న సిబ్బంది ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం చెన్నూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కూలీలు క్షేమంగా ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement