కుంటాల: అప్పులు తీర్చలేనన్న బెంగతో లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామానికి చెందిన కామొల్ల రాములు(42) ఉరేసుకొని ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. ఎస్సై సిరివేని అశోక్ కథనం ప్రకారం.. రాములు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నాడు. అప్పుల బాధ భరించలేక మంగళవారం రాత్రి కల్లూరు గ్రామ శివారులోని వైన్స్ వెనుక చెట్టుకు తన ప్యాంటుతో ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు కొన ఊపిరితో ఉన్న ఆయనను 108 వాహనంలో భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. రాములు భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.


