మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండల కేంద్రంలో బుధవారం పోలీసులు గంజాయి కలిగి ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. హాజీపూర్ ఎస్సై కిరణ్‌కుమార్ కథనం మేరకు.. మండల కేంద్రంలో నార్కోటిక్ టీం, డాగ్‌తో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కొందరి వద్ద డాగ్ సింబ అనుమానాస్పదంగా వ్యవహరించింది. వెంటనే వారిని తనిఖీ చేయగా 74 గ్రాముల 19 గంజాయి ప్యాకెట్లు లభించాయి. ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 6 మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.
ఆన్‌లైన్ సెంటర్‌లో చోరీ
బాసర: మండలంలోని బిద్రెల్లిలో మంగళవారం దొంగలు హల్‌చల్ చేశారు. గురుకృప ఆన్‌లైన్ మల్టీసర్వీస్ సెంటర్‌లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కౌంటర్ నుంచి రూ.4వేల నగదు ఎత్తుకెళ్లినట్లు సీఐ దీపక్ తెలిపారు. బుధవారం క్లూస్‌టీం వచ్చి ఆధారాలను సేకరించిందని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీఐ వెల్లడించారు.
విద్యుత్ షాక్‌తో కాడెద్దు మృతి
పెంబి: మండలంలోని కోరకంటి గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి సూర్యభాను అనే రైతుకు చెందిన కాడెద్దు బుధవారం మృతి చెందింది. విద్యుత్ స్తంభం వద్ద ఎర్త్ తీగను అధికారులు సరిగా అమర్చకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు.


