బెల్లంపల్లి: మందమర్రి ఏరియా శాంతిఖని గని నుంచి అక్రమంగా కాపర్‌వైర్ దొంగిలించిన ఏడుగురిని పోలీసులు పట్టుకున్నారు. బెల్లంపల్లి రూరల్ సీఐ సీహెచ్ హనోక్ తెలిపిన వివరాల ప్రకారం.. శాంతిఖని గనిలో కొద్ది రోజుల క్రితం కాపర్ వైర్ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కాపర్ వైర్ పట్టుకెళ్లారని గని అఽధికారి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం టూటౌన్ ఎస్సై సీ.హెచ్ కిరణ్‌కుమార్ శాంతిఖని ప్రాంతంలో సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకోగా వారి వద్ద 10 కిలోల కాపర్ వైర్ లభ్యమైందని సీఐ తెలిపారు. ఆ వైర్‌ను శాంతిఖని గనిలో దొంగతనం చేసినట్లు మందమర్రి విద్యానగర్‌కు చెందిన ఉల్లిగడ్డల వ్యాపారులు పాస్తం గోపాల్, కళమంచి అశోక్, కళమంచి కల్యాణ్, పాస్తం వీరస్వామి, పార్థన్ గణేశ్, రాజసమ్మయ్య, పాస్తం సారయ్య అంగీకరించారు. చోరీ చేసిన వైరును చెట్ల పొదల్లో దాచిపెట్టి తీసుకెళ్లడానికి వచ్చి పోలీసులకు పట్టుబడ్డారు. సదరు వ్యక్తులు రామకృష్ణాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో రెండు నేరాలలో నిందితులుగా ఉన్నట్లు సీఐ వెల్లడించారు. ఈమేరకు నిందితులను కోర్టులో హాజరు పర్చినట్లు పేర్కొన్నారు. టూటౌన్ ఎస్సై సీ.హెచ్ కిరణ్‌కుమార్, సీసీఎస్ ఎస్సై శిరీష, సిబ్బంది పాల్గొన్నారు.


