‘మాలల చైతన్య సమితి’ కరపత్రం విడుదల
మహబూబ్‌నగర్ రూరల్: మాలల చైతన్య సమితి 10వ వార్షికోత్సవ కరపత్రాన్ని సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మూలె కేశవులు ఆదివారం జిల్లాకేంద్రంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2015లో మాలల చైతన్య సమితి ఆవిర్భవించి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశామన్నారు. అంతేగాక సమాజంలో దళితులపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. ఈ నెల 28 ఉదయం 11 గంటలకు జిల్లాకేంద్రంలోని టీఎన్జీఓస్ భవనంలో వార్షికోత్సవ కార్యక్రమం ఉంటుందని.. జిల్లాలోని మాలల చైతన్య సమితి నాయకులు, ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు చిన్నయ్య, యాదయ్య, వెంకట్రాములు, జి.యాదగిరి, బి.చెన్నయ్య, మల్లేష్, కావలి చెన్నయ్య, జి.రాజు, కె.బాలచెన్నయ్య, కుర్మయ్య, రామచందర్, నర్సింహ, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.


