శతాబ్ది ఉత్సవాలకు రావాలని సీఎంకు ఆహ్వానం
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని షాసాబ్‌గుట్ట హజ్రత్ సయ్యద్ మర్దాన్‌అలీషా ఖాద్రీ రహెమతుల్ల అలైహి శతాబ్ది ఉర్సు వేడుకల్లో పాల్గొనాలని కోరుతూ ఆదివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని నిర్వాహకులు ఆహ్వానించారు. దర్గా శతాబ్ది వేడుకలు వచ్చేనెల 21 నుంచి 23వ తేదీ వరకు జరుగుతాయని, ఉత్సవాల్లో పాల్గొనాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ అలీ షబ్బీర్, రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్, టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని తదితరులు పాల్గొన్నారు.


