పల్లె మురవాలె
కొలువుదీరనున్న
పాలక వర్గాలు
రెండేళ్లుగా ఇలాగే..
134 జీపీలు
పక్క భవనాలు లేవు..
పాలన మెరవాలె..
కొత్త సర్పంచ్‌లకు సమస్యల స్వాగతం
గ్రామ పంచాయతీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ప్రతి పనిని పూర్తి చేసేందుకు కృషి చేస్తా. ప్రజలు నాకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. అందరికీ నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తా. నిర్మాణంలో ఉన్న పంచాయతీ భవనాన్ని త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తా. – కె.రాకేష్, సర్పంచ్,
చౌదర్‌పల్లి పెద్ద తండా, మహమ్మదాబాద్
నా భర్త శ్రీనునాయక్ గతంలో సర్పంచ్‌గా పని చేశారు. సేవ చేస్తానన్న నమ్మకంతో ప్రజలు ఈసారి నాకు పట్టం కట్టారు. తండాలో మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా పని చేస్తా. వార్డు సభ్యుల సహకారంతో అభివృద్ధి పనులు చేపడతాం. తండా రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తాం.
– కె.జ్యోతి, సర్పంచ్, మాచన్‌పల్లి తండా, మహబూబ్‌నగర్ రూరల్
గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిబంధనల ప్రకారం సోమవారం ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఎండీపీఓలకు ఆదేశాలు జారీ చేశాం. ఇలాంటి పొరపాట్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.
– వెంకట్‌రెడ్డి, ఇంచార్జీ డీపీఓ
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు. గ్రామాల్లో సర్పంచ్ పదవి బాధ్యతాయుతమైంది. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ప్రభుత్వం 1959లో జిల్లా, బ్లాక్, గ్రామ పంచాయత్ అనే మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. స్థానిక ప్రజల అవసరాలకనుగుణంగా వనరుల వినియోగం, శాశ్వతమైన పరిపాలన అమలుకు యంత్రాంగం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గ్రామీణుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలనే సంకల్పంతో ఏర్పాటైన పంచాయతీరాజ్ వ్యవస్థ రోజురోజుకు గాడి తప్పుతోంది. ఏ పల్లెలో చూసినా సమస్యలు తిష్ట వేశాయి. సీసీలకు నోచుకోని అంతర్గత రోడ్లు, లోపించిన పారిశుద్ధ్యం, నేటికీ సొంత భవనాలకు నోచుకోని పంచాయతీలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో నూతనంగా గెలిచిన సర్పంచ్‌లు సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టనుండగా.. ఏ మేరకు ఆయా సమస్యలను పరిష్కరిస్తారో.. పాలన ఏ విధంగా సాగిస్తారో వేచిచూడాల్సి ఉంది.
జిల్లాలో 423 గ్రామ పంచాయతీలు ఉండగా 134 జీపీలకు పక్కా భవనాలు లేవు. ఇందులో 42 కార్యాలయాలు అద్దె భవనాల్లో, 92 భవనాలు కమ్యూనిటీ హాళ్లు, అంగన్‌న్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు ఇతరత్రా సెంటర్లలో తాత్కాలికంగా సర్దుబాటు చేసి పంచాయతీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల రేకుల షెడ్లలో కూడా భవనాలు కొనసాగుతున్నాయి. మరికొన్ని భవనాలు శిఽథిలావస్థకు చేరాయి. చాలా కార్యాలయాలకు మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం గత ప్రభుత్వం తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. తండాలతో పాటు కొన్ని గ్రామ పంచాయతీలకు గూడు లేకుండాపోయింది. ప్రభుత్వం పలు జీపీలకు నూతన భవనాలను మంజూరు చేసినా నిధుల కొరత కారణంగా మధ్యలో నిలిచిపోయాయి.
సొంత భవనాలకు నోచుకోని
పంచాయతీలు ఎన్నో..
అద్దె భవనాలు, పాఠశాలలు,
అంగన్‌వాడీల్లో కొనసాగింపు
చెట్ల కిందే గ్రామసభల నిర్వహణ
నేడు కొలువుదీరనున్న నూతన పాలకవర్గాలు
రెండేళ్లుగా గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేక పల్లెపాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించినా నిధులలేమి సమస్యతో ఇప్పటి వరకు పల్లెబాట పట్టలేదు. దీంతో స్థానిక కార్యదర్ములు ఎలాగోలా నెట్టుకొచ్చారు. కార్యదర్శులు తమకున్న అధికార పరిధిలో పరిపాలన అందించినా ప్రజాప్రతినిధులు లేక ప్రజలు సైతం సమస్యలను భరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులు ఆలస్యమైనా పాలకవర్గాలు ఉంటే సర్పంచ్, వార్డు సభ్యులు తమ పలుకుబడిని ఉపయోగించి ప్రజల కనీస అవసరాలైన తాగునీరు, వీధి దీపాలు, మురుగు కాల్వలను శుభ్రం చేయించే పరిస్థితి ఉండేది. జిల్లా అధికారులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు స్థానిక సమస్యలు వివరించి అదనపు నిధులు రాబట్టేందుకు పాలకవర్గాలు ప్రయత్నించేవారు. సోమవారం సర్పంచ్‌లు బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో పల్లె పాలనలో గాడిలో పడనుంది.
పల్లె మురవాలె
పల్లె మురవాలె


