కేయూ ఉద్యోగులకు వేతనాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

కేయూ ఉద్యోగులకు వేతనాలు విడుదల

Jun 13 2026 1:41 PM | Updated on Jun 13 2026 1:41 PM

పెన్షన్‌దారులకు పెన్షన్‌ కూడా..

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీలోని బోధన, బో ధనేతర ఉద్యోగులు, కాంట్రాక్టు అధ్యాపకులు, కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు పెన్షన్‌దారులకు కూడా శుక్రవారం సాయంత్రం అధికారులు యూనివర్సిటీ అంతర్గత నిధుల నుంచి వేతనాలు విడుదల చేశారు. కేయూలో ఉద్యోగులు, పెన్షన్‌దారులకు వేతనాలు విడుదల జాప్యంతో ఇబ్బందులు పడుతున్నారని ‘అందని మే నెల వేతనాలు’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. సంబంధిత పోర్టల్‌లో బిల్లులు అప్‌లోడ్‌ కావడం లేద ని, దీంతో వేతనాల బిల్లులుకు సంబంధించిన ప్రతి పాదనలు డీటీఓకు చేరలేదని, దీంతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు అంటూ కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రి జిస్ట్రార్‌ వి. రామచంద్రం, కేయూ ఫైనాన్స్‌ ఆఫీసర్‌ హబీబుద్దీన్‌ చర్చించారు. ఐఎఫ్‌ఎంఎస్‌లో వేతనబిల్లులు అప్‌లోడ్‌ కావాలంటే సాంకేతిక సమస్య రెక్టిఫై కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత డీటీఓకు వెళ్లి ప్రభుత్వం నుంచి వేతనాలు విడుదల కావాలంటే కొద్దిరోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈనెల 13న రెండో శనివారం,14న ఆ దివారం సెలవుదినాలు కూడా వస్తున్నాయి. ఉద్యోగుల,పెన్షన్‌దారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేయూ అంతర్గత నిధుల నుంచే వేతనాలు విడుదల చేశారు. దీంతో ఉద్యోగులు, పెన్షన్‌దారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement