హన్మకొండ కల్చరల్: అర్చక ఉద్యోగులు దీర్ఘకాలిక పోరాట ఫలితమే ఈ విజయమని తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ దేవాదాయ అర్చకులు, ఇతర దేవాలయ ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్ట్ నుంచి ప్రస్తుత పథకాల పెంపుకు రాష్ట్ర దేవాదాయశాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా సచివాలయంలో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు సంబంధిత సర్క్యులర్ కాపీని జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మకు అందజేశారు. ఉపేంద్రశర్మ మాట్లాడుతూ 2026 ఏప్రిల్ నుంచి రిటైర్మెంట్ అయిన అర్చకులకు రూ. 12లక్షలు చెల్లిస్తారన్నారు. జేఏసీ కన్వీనర్ పరాశరం రవీంద్రాచారి, కాండూరి కృష్ణమాచారి, పెన్నా మోహన్‌శర్మ, వాసుదేవశర్మ, డీవీ ఆర్‌శర్మ, నారాయణస్వామి, శ్రీనివాసరావు, కృష్ణప్రసాద్, బాబు శంకర్ పాల్గొన్నారు. కాగా, మంత్రి సురేఖ.. ఫస్ట్, సెకండ్ గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు ప్రమోషన్ పత్రాలు అందజేశారు. ఆమె మాట్లాడుతూ ఆలయాల్లో అవినీతిని సహించేది లేదని, దేవాలయానికి సాంప్రదాయంగా వచ్చే మహిళలను గౌరవించాలన్నారు. జీన్స్ ప్యాంట్లు ధరించి వచ్చే వారిని అనుమతించకూడదని పేర్కొన్నారు.
తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ


