టీబీ డ్యాంకు 365 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో | - | Sakshi
Sakshi News home page

టీబీ డ్యాంకు 365 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

Jun 14 2026 7:16 AM | Updated on Jun 14 2026 7:16 AM

హొళగుంద: కర్ణాటకలోని హొస్పేట్‌ వద్ద నిర్మించిన తుంగభద్ర రిజర్వాయర్‌కు శనివారం 365 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. డ్యాంలో మొత్తం 9.903 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ భాగం ఆగుంబే, తీర్థన హళ్లీ, వరనాడు, శివమొగ్గ, సాగర, శృంగేరి తదితర భాగాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఇన్‌ఫ్లో తొలిసారిగా శనివారం నమోదైంది. గతేడాది ఇదే సమయానికి టీబీ డ్యాంకు 8,269 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, జలాశయంలో 25.589 టీఎంసీల నీరు ఉండేది. ఈ ఏడాది భారీ వర్షాలు లేకపోవడంతో ఇన్‌ఫ్లో మందగించింది. సకాలంలో డ్యాంలో నీరు చేరితేనే జూలై ఆఖరిలో ఎల్లెల్సీకి నీటిని విడుదల చేసే అవకాశాలుంటాయి. శనివారం టీబీ డ్యాంలో 1,633 అడుగులకు గాను 1588.60 అడుగులతో అవుట్‌ఫ్లో 57 క్యూసెక్కులుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement