● 20 మంది రైతుల బోర్ల తీగలు అపహరణ
పాణ్యం: వ్యవసాయ బోర్ల మోటార్లకు ఏర్పా టు చేసిన విద్యుత్ తీగలను దొంగలు అపహరించారు. మండల కేంద్రమైన పాణ్యం – వడ్డుగండ్ల రస్తాలో శనివారం తెల్లవారు జామున దాదాపు 20 బోర్లకు చెందిన తీగలను కట్ చేసి దొంగిలించారు. ఉదయం పొలాలకు వెళ్లిన రైతులకు బోర్ల తీగలు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. స్టార్టర్ నుంచి భూగర్భంలో మోటార్‌కు అమర్చిన ఉన్న వైర్‌ను దొంగలు బలవంతగా లాగడం వలన కనెక్షన్ తెగిపోవడంతో రైతులపై భారం పడుతోంది. కొత్త కనెక్షన్ ఇచ్చేందుకు రూ. 10 –15 వేల వరకు ఖర్చు అవుతోంది. భూగర్భంలో ఉన్న మోటార్‌ను బయటకు తీసి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. తీగల దొంగల వల్ల పాణ్యంలో 20 మందిలపై భారం పడింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి దొంగలను పట్టుకుని చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


