బేతంచెర్ల: వైష్ణవ పుణ్య క్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయం శనివారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. జ్యేష్ట మాసం శుభ దినాలను పుర స్కరించుకొని జిల్లా నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువజామున ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనానికి బారులుదీరారు. అభిషేకం, ఆకుపూజ, కుంకుమార్చన పూజ ల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు చర్యలు చేపట్టారు.


