మహానంది: మహానంది క్షేత్రం శనివారం వీకెండ్ సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటూ వివిధ ప్రాంతాలకు చెందిన వేలా ది మంది భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. అధికారులు ఉదయం నుంచి రాత్రి వరకు నిర్విరామంగా దర్శన సౌకర్యం కల్పించారు.అయితే సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు మహా మంగళ హార తి సమయంలో భక్తులను అనుమతించకపోవడంతో ఆలయరాజగోపురం నుంచి అధికసంఖ్యలో వేచి ఉన్నారు. హారతి సమయం తర్వాత అందరిని ఒకేసారి అనుమతించడంతో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అలాగే ఒక్కొక్క కొబ్బరి కాయకు విక్రయ దారులు రూ.50 తీసుకున్నట్లు భక్తులు తెలిపారు. అధికారులు స్పందించి నిబంధనల మేరకు కొబ్బరికాయల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కో రారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఆలయ సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి, దేవస్థాన సిబ్బంది తగిన చర్యలు తీసుకున్నారు.


