గన్నవరం: కేంద్ర ఆహార ప్రాసెసింగ్, పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు గన్నవరం విమానాశ్రయంలో శుక్రవారం ఘన స్వాగతం లభించింది. విజయవాడ పర్యటన నిమిత్తం ఆయన విశాఖపట్నం నుంచి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో రాత్రి ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయంలో చిరాగ్ పాశ్వాన్‌కు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్, గుడివాడ ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, పలువురు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా విజయవాడ బయలుదేరి వెళ్లారు.


