కాటేస్తున్న కాలుష్యం | - | Sakshi
Sakshi News home page

కాటేస్తున్న కాలుష్యం

Jun 5 2026 10:09 AM | Updated on Jun 5 2026 10:09 AM

లబ్బీపేట(విజయవాడతూర్పు): మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే ఆక్సిజన్‌ అవసరం. అందుకోసం మనం నిరంతరం శ్వాస తీసుకుంటూనే ఉంటాం. అలా పీల్చే గాలి స్వచ్ఛంగా ఉంటే ఆరోగ్యంగా జీవిస్తాం. కానీ విజయవాడ నగర ప్రజలు పీల్చే గాలిలో దుమ్ము శాతం, కార్బన్‌ మోనాకై ్సడ్‌, సల్ఫర్‌ డయాకై ్సడ్‌, అమ్మోనియం వంటివి ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువగా ఉంటున్నట్లు పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా ప్రజలు అనేక ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం తీసుకునే చర్యలు అంతంత మాత్రమే. నగరంలో తిరిగే ఆర్టీసీ బస్సుల్లో 70 శాతం కాలం చెల్లినవే ఉన్నాయి. వ్యక్తిగత వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇవన్నీ కాలుష్య కారకాలుగా మారుతున్నాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు పర్యావరణ పరిరక్షణకు చేసే ప్రతిజ్ఞలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. ● కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు విషం చిమ్మినట్లు కాలుష్యాన్ని చిమ్ముతున్నాయి. ● వ్యక్తిగత వాహనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ● గాలిలో దుమ్ము శాతం కూడా ఎక్కువగా ఉంది. ● ఏసీలు, ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు విచ్చలవిడి వినియోగం కూడా కాలుష్యానికి కారణమే ● నగరంలో అవసరం మేర మొక్కలు లేకపోవడం ● కాలుష్య ప్రభావంతో మతిమరుపు వచ్చే అవకాశం ఉంది. ● వాయు కాలుష్యంతో పక్షవాతానికి గురవుతున్నారు. ● వాసన గ్రహించలేక పోతారు. ● పార్కిన్‌సన్స్‌(వణుకుడు రోగం), డిప్రెషన్‌కు గురి కావచ్చు. ● ఫిట్స్‌, మైగ్రేన్‌ తలనొప్పి వంటివి రావచ్చు. ● మధుమేహం, రక్తపోటు, గుండెపోటుకు దారితీస్తుంది.

పొల్యూషన్‌ హాట్‌స్పాట్‌గా మారిన విజయవాడ నగరం కాలుష్యం కారణంగా అనేక వ్యాధులు గుండెపోటు, మెదడుపోటుకు దారితీస్తున్న వైనం అదుపులో ఉండని మధుమేహం, రక్తపోటు కాలుష్య నివారణకు చర్యలు శూన్యం

ద్విచక్రవాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్‌తో పాటు, సర్జికల్‌ మాస్క్‌ లాంటివి పెట్టుకుంటే మంచిది.

వీలైనంత వరకూ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (బస్సులు)ను వినియోగిస్తే కాలుష్యం బారిన పడకుండా కొంతవరకూ తగ్గించుకోవచ్చు.

కాలం చెల్లిన బస్సులు, ఇతర వాహనాల వినియోగాన్ని నివారించాలి.

ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకంపై దృష్టి సారించాలి.

రోడ్ల వెంట విరివిగా మొక్కలు నాటితే కాలుష్య ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తాయి.

కాలుష్యానికి కారణాలివే

కాలుష్య ప్రభావ సమస్యలివే

ఇవే నిదర్శనాలు

● తాడిగడపకు చెందిన 40 ఏళ్ల వెంకటేష్‌ గాంధీనగర్‌లోని ఓ సంస్థలో ఉద్యోగం చేస్తుంటారు. నిత్యం ద్విచక్రవాహనంపై విధులకు వస్తుంటారు. ఇటీవల నీరసంగా ఉండటంతో పరీక్ష చేయించుకుంటే షుగర్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతనికి ఫ్యామిలీ హిస్టరీ కూడా లేక పోవడంతో కాలుష్యమే కారణమై ఉంటుందంటున్నారు.

● భవానీపురానికి చెందిన 38 ఏళ్ల అభిలాష్‌ మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా చేస్తుంటారు. విధి నిర్వహణలో భాగంగా నిత్యం బైక్‌పై తిరుగుతుంటారు. ఇటీవల వాసన గ్రహించలేకపోవడం, డిప్రెషన్‌కు లోనవుతున్నారు.

కాలుష్య ప్రభావమే కారణమంటున్నారు.

నివారణకు ఏమి చేయాలి?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement