దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 3.41 కోట్లు | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 3.41 కోట్లు

Jun 4 2026 7:09 AM | Updated on Jun 4 2026 7:09 AM

రెండు రోజులపాటు నగర వనం మూసివేత

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బెజవాడ దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.3.41 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 16 రోజులకు రూ.3,41,39,565 నగదు. 273 గ్రాముల బంగారం, 4.450 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈఓ శీనానాయక్‌ తెలిపారు. ఇక విదేశాలకు చెందిన కరెన్సీ సైతం భారీగానే లభించినట్లు అధికారులు పేర్కొన్నారు. 349 యూఎస్‌ఏ డాలర్లు, 335 నేపాల్‌ రూపీ, 1,390 యూఏఈ దిర్హమ్స్‌, 195 కెనడా డాలర్లు, 200 సౌత్‌ ఆఫ్రికా రాండ్‌లు, 100 రష్యన్‌ రుబీలు, 200 ఓమన్‌ బైంసాలు, ఐద వేల సిరియా పౌండ్లు లభించాయని వివ రించారు. కానుకల లెక్కింపును దుర్గగుడి చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు పాల్గొనగా, పోలీసులతో పాటు ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది పర్యవేక్షించారు.

ప్రభుత్వాస్పత్రి స్టోర్స్‌లో డీఎంఈ తనిఖీలు

లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలోని డ్రగ్‌ స్టోర్స్‌ను బుధవారం రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు డాక్టర్‌ విష్ణువర్ధన్‌ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం స్టోర్స్‌లో స్టాక్‌ ఎంత ఉంది, విని యోగం ఎంత, అత్యవసర మందులు, రెండే ళ్లలో వాడిన మందుల రికార్డులు వంటి వాటిని తనిఖీ చేశారు. స్థానికంగా కొనుగోలు చేసిన మందుల వివరాలు రికార్డులను పరిశీలించారు. సుమారు గంట పాటు ఆయన స్టోర్స్‌లో తనిఖీ చేశారు. ఆయన వెంట అడిషనల్‌ డీఎంఈ డాక్టర్‌ వి.రాధికారెడ్డి, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రఘునందన్‌, ఇతర అధికారులు ఉన్నారు. గతంలో కొనుగోలు చేసిన మందులు, సర్జికల్స్‌పై ఫిర్యాదుల రావడంతోనే తనిఖీలు నిర్వహించినట్లు ఆస్పత్రిలో చర్చ జరిగింది. అసలు కారణం ఏమిటనేది తెలియరాలేదు. ప్రస్తుతం ఉన్న మందులు, అత్యవసర మందుల స్టాక్‌ రిజిస్టర్‌ను కూడా పరిశీలించారు.

బందరు జీజీహెచ్‌లోగ్రహణ పాదాలకు చికిత్స

మచిలీపట్నంఅర్బన్‌: స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్‌)లో గ్రహణ పాదాల (క్లబ్‌ ఫుట్‌) చికిత్స అందుబాటులోకి వచ్చిందని, ఈ సేవలను జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ టి.లీలాప్రసాద్‌ సూచించారు. ప్రపంచ గ్రహణ పాదాల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జీజీహెచ్‌ ఆర్థోపెడిక్‌ విభాగంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో గ్రహణ పాదాల సమస్యతో బాధపడుతున్న రోగులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం బందరు జీజీహెచ్‌లోనే ఈ సమస్యకు అవసరమైన చికిత్స, శస్త్రచికిత్స అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ఆర్థోపెడిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ పి. కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. గ్రహణ పాదాల శస్త్రచికిత్సలకు అవసరమైన ప్రత్యేక పరికరా లను ఆస్పత్రిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప పర్యవేక్షణ అధికారి డాక్టర్‌ భానుమూర్తి, డాక్టర్‌ భరత్‌ సింగ్‌, డాక్టర్‌ శ్రీనివాసులు, ఆర్‌ఎంఓ డాక్టర్‌ నిరంజన్‌, ఆర్థోపెడిక్‌ విభాగానికి చెందిన వైద్యులు పాల్గొన్నారు.

మూలపాడు(ఇబ్రహీంపట్నం): మూలపాడు సీతాకోకచిలుకల పార్క్‌ (నగర వనం)ను రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు కంచికచర్ల ఫారెస్ట్‌ డీఆర్వో శివప్రసాద్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. నగరవనంతో పాటు పరిసర అటవీ ప్రాంతంలో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గురు, శుక్రవారాలు సీతాకోక చిలుకల పార్క్‌ మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. సందర్శకులను వనంలోకి అనుమతించడం లేదని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement