పెద్ద ఎత్తున తరలివచ్చి నినదించిన యువత డీఎస్సీ అవకతవకలపై విచారణ జరపాలని డిమాండ్ అసమర్థ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని నినాదాలు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన వైఎస్సార్ సీపీ నేతలు
దగా డీఎస్సీపై దద్దరిల్లిన కలెక్టరేట్
మచిలీపట్నంఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలపై కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక నిరసన కార్యక్రమం జరిగింది. నగరంలోని లక్ష్మీటాకీస్ సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ర్యాలీగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చౌక్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు శ్రేణులు ర్యాలీగా బయలుదేరటంతో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి నిలువరించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులు అందరినీ పంపేది లేదని, ముఖ్యమైన నాయకులు పది మంది వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వాలని చెప్పటంతో కొద్దిసేపు పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు ముఖ్యమైన నాయకులను కలెక్టరేట్‌లోకి అనుమతించారు. అనంతరం మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం అందజేసి, డీఎస్సీలో జరిగిన అక్రమాలపై కలెక్టర్‌కు నాయకులు వివరించారు. కార్యక్రమంలో మచిలీపట్నం మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్‌సలార్‌దాదా, నగర పార్టీ అధ్యక్షుడు మేకల సుధాకర్‌బాబు (సుబ్బన్న), వైఎస్సార్ సీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు మాచవరపు రాంప్రసాద్, పల్లి శేఖర్, శ్రీరాం చిన్నా, గాజుల భగవాన్, చిటికిన నాగేశ్వరరావు, గూడవల్లి నాగరాజు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. రాజేంద్ర ప్రసాద్, కార్యదర్శి అరిగే హేమంత్ నాయుడు, ఉపాధ్యక్షుడు జె. మణికంఠ, జిల్లా విద్యార్థి విభాగం ప్రధానకార్యదర్శి వీరయ్య, గన్నవరం నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు ఎస్. రవి, గుడ్లవల్లేరు మండల యువజన అధ్యక్షుడు జి. రవి, గుడివాడ టౌన్ యువజన అధ్యక్షుడు అడపా హర్ష, అవనిగడ్డ యువజన విభాగం అధ్యక్షుడు చింతలపూడి భాస్కరరావు, పామర్రు యువజన విభాగం అధ్యక్షుడు భగవత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


