పొగ తాగేవారిలో ప్రాణాంతక వ్యాధులు లంగ్, గొంతు క్యాన్సర్‌లతో పాటు, గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్ పొగ పీల్చేవారిలోను వ్యాధులు నేడు నో టుబాకో దినోత్సవం
భవానీపురానికి చెందిన 35 ఏళ్ల మధు తరచూ దగ్గు, ఆయాసం రావడంతో వైద్యుడిని సంప్రదించారు. ధూమపానం ఊపిరితిత్తులపై ప్రభావం చూపడమే కారణంగా తేల్చారు. ఇలా వీళ్లిద్దరే కాదు ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రతిఏటా 25 వేల నుంచి 30 వేల మంది ధూమపానం కారణంగా వివిధ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
కంకిపాడుకు చెందిన 31 ఏళ్ల ఆకాష్ విపరీతంగా సిగరెట్లు తాగుతుంటాడు. ఇటీవల ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించగా, అక్కడ పరీక్షించి గుండెపోటుగా నిర్ధారించారు. అతనికి గుండెపోటుకు ధూమపానమే కారణంగా తేల్చారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): టీనేజ్‌లో సిగిరెట్ వెలిగించిన క్షణం ఆనందంగా ఉన్నట్లు అనిపించినా అదే పొగ నిశ్శబ్దంగా శరీరంలో ప్రమాదాన్ని పెంచుతుంది. సరదా సరదా సిగిరెట్ అంటూ మొదలై వ్యాధులు బారిన పడి ప్రాణాలు విడిచే పరిస్థితి ఎదురవుతోంది. విద్యార్ధి దశలోనే ధూమపానం, గంజాయి వంటి వాటికి భానిసలుగా మారుతున్న వారు అధికంగానే ఉంటున్నారు. అలాంటి వారిలోతీవ్రమైన శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యులు చెపుతున్నారు. ఇ– సిగరెట్లు కూడా ప్రమాదకరమేనని వైద్యులు చెపుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగకూడదనే నిబంధన ఉన్నా, దానిని బుట్టదాఖలు చేసేశారు. దీంతో పొగతాగేవారితో పాటు,పీల్చేవాళ్లు కూడా వ్యాధుల భారినపడుతున్నారు. ఈ ఏడాది మేగ 31వ తేదీ నో టుబాకో డే సందర్భంగా పొగాకు ఉత్పత్తుల సంస్థలు వివిధ రూపాల్లో యువతను ఆకర్షించే ప్రయత్నాలపై అవగాహన కలిగించాలని నినాదంతో నిర్వహించనున్నారు.
ఏటా పెరుగుతున్న బాధితులు
పొగ త్రాగడం ప్రాణాంతకమని ఎంత ప్రచారం చేస్తున్నా ధూమపానానికి అలవాటు పడుతున్న వారి సంఖ్య ఎక్కువుగానే ఉంటోంది. ఇంటర్మీడియెట్, పాఠశాల స్థాయిలోనే నేడు సిగరెట్లు తాగడానికి అలవాటు పడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధమవుతుంది. ఇటీవల ఇ– సిగరెట్లు పేరుతో మాదక ద్రవ్యాలు సైతం విక్రయాలు జరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు నకిలీ సిగరెట్లు సైతం మార్కెట్‌లోవిజృంభిస్తున్నాయి.
ధూమపానంతో వచ్చే అనర్థాలివి
ఇలా మానొచ్చు


