పెనమలూరు: పారిశ్రామికవేత్తలు కౌశలం పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కానూరు సిద్ధార్థ కాలేజీలో శనివారం కౌశలం పోర్టల్‌పై అవగాహన కార్యక్రమం నిర్వ హించి పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి జరిగింది. కౌశలం పోర్టల్ ద్వారా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం, మానవ వనరుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశల్లో మానవవనరుల కొరత ఉన్నట్లు తన దృష్టికి తీసుకు వచ్చారన్నారు. ఉద్యోగ మేళాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినా దూరప్రాంతాల్లో ఉద్యోగాలు చేయటానికి ముందుకు రావటంలేదన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కౌశలం రూపొందించిందన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని కౌశలం ప్రాజెక్ట్ డైరెక్టర్ రవికుమార్ అన్నారు. పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ బాబ్జి, వాణిజ్య పన్నుల జాయింట్ కమిషనర్ కల్పన తదితరులు పాల్గొన్నారు.


