టీడీపీ నేతల వ్యూహం
భవానీపురం(వియవాడపశ్చిమ): మాయ మాటలు, తాయిలాల పంపిణీతో ప్రజలను ఆకట్టుకోవడంలో తమకు తామే సాటి అని నిరూపించుకుంటున్నారు టీడీపీ నేతలు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పార్టీ మీటింగ్‌లకు జనాల్ని ఎలా రప్పించుకునేందుకు సకల విద్యలు ప్రయోగిస్తున్నారు. ఇదే ఆనవాయితీ గురువారం మైలవరం నియోజకవర్గం గొల్లపూడి గ్రామ పార్టీ నాయకులు కూడా కొనసాగించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని పార్టీ తలపెట్టిన మహానాడు కార్యక్రమాన్ని రెండు రోజులపాటు గొల్లపూడిలోని పద్మావతి కల్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. ఆ మీటింగుకు జనాలను రప్పించేందుకు స్థానిక నేతలు మీటింగ్‌కు హాజరయ్యే వారికి రూ.300, బిర్యానీ, మహిళలకు చీరల పంపిణీ ఉంటుందని ప్రచారం చేసి రప్పించారు.
జీజీహెచ్‌లో ఎంఆర్‌డీ విభాగం ప్రారంభం
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో గురువారం దాత డాక్టర్ తాతినేని గోపాలరావు రూ.30 లక్షల విరాళంతో నూతనంగా నిర్మించిన మెడికల్ రికార్డు విభాగాన్ని (ఎంఆర్‌డీ) ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్‌ఎస్‌వీ రమణ గురువారం ప్రారంభించారు. మెడికల్ రికార్డు ఆఫీసర్ కందిమళ్ల రామారావు, జింఖానా కోఆర్డినేటర్ డాక్టర్ వెనిగళ్ల బాలభాస్కరరావు, నాట్కో క్యాన్సర్ సెంటర్ కోఆర్డినేటర్ అశోక్‌కుమార్ పాల్గొన్నారు.


