విజయవాడ నగరంలో... | - | Sakshi
Sakshi News home page

విజయవాడ నగరంలో...

May 28 2026 2:28 AM | Updated on May 28 2026 2:28 AM

విజయవాడ నగరంలో...

విజయవాడ నగరంలో ఆదివారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు వైర్లు తెగి ఏడు ఫీడర్ల పరిధిలో గంటల తరబడి విద్యుత్‌ లేకుండా పోయింది. మంగళవారం రాత్రి గుణదలలో లైన్లు లూజుగా ఉండి, నిప్పురవ్వలు రాలి, గడ్డి తగలబడటంతోపాటు, ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్‌ పరికరాలు దగ్ధమయ్యాయి. దీంతో గన్నవరం, గూడవల్లి, గుణదల, పాలిటెక్నికల్‌ కాలేజీ, ఎనికేపాడు ప్రాంతాల్లో మూడు గంటలకు పైగా విద్యుత్‌ సరఫరాకు ఆటంకం కలిగింది. ఈ నెల 22వ తేదీనే గుణదలలో లైన్ల నుంచి నిప్పురవ్వలు పడినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో మంగళవారం ప్రమాదం జరిగింది. మైలవరం, జగ్గయ్యపేట, చిలకల్లు ప్రాంతాల్లో ఈదురు గాలుల కార ణంగా సోమవారం నాలుగు గంటలకు పైగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మంగళ వారం రాత్రి వీచిన గాలులకు మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో ఫీడర్లు ట్రిప్పయ్యి రెండు, మూడు గంటల పాటు విద్యుత్‌ నిలిచిపోయింది.

గుణదల విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఆవరణలో

మంగళవారం ఎగసిపడుతున్న మంటలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement