దుర్గమ్మ సేవలో రవాణా శాఖ మంత్రి | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ సేవలో రవాణా శాఖ మంత్రి

May 27 2026 10:20 AM | Updated on May 27 2026 10:20 AM

దుర్గమ్మ సేవలో రవాణా శాఖ మంత్రి ఇంద్రకీలాద్రి(విజయాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్‌రెడ్డి, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి వేర్వేరుగా ఇంద్రకీలాద్రికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం పండితులు ఆశీర్వదించారు. అనంతరం అర్చకులు, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటాలను అందజేశారు. నిత్యాన్నదానానికి పలువురు విరాళాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు మంగళవారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. విజయవాడ బెంజ్‌సర్కిల్‌ ప్రాంతానికి చెందిన పాతపాటి పూర్ణ శైలజ అమ్మవారి నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన మధుకుమార్‌ రూ. 1.80 లక్షల విరాళాన్ని ఏఈవో వెంకటరెడ్డికి అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. వైభవంగా వేంకటేశ్వరుడి వార్షికోత్సవాలు గుడ్లవల్లేరు: మండలంలో డోకిపర్రు మహాక్షేత్రంలోని శ్రీ భూసమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థాన వార్షికోత్సవాలను మంగళవారం వైభవోపేతంగా ప్రారంభించారు. మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌(మెయిల్‌) అధినేతలు, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వేంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతుల ఆధ్వర్యాన ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కె.బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ దంపతులు తెలిపారు. దేవస్థానంలో ఉత్సవ మూర్తులకు విశేష పంచామృత స్నపన, తిరుమంజనం, విష్వక్సేనారాధన, మేదినీ పూజ, అంకురార్పణ కార్యక్రమాలను వేద మంత్రోచ్చరణ నడుమ వేద పండితులు చేపట్టారు. భక్తులకు చలువ పందిళ్లతో పాటు మంచినీరు వంటి కనీస వసతులను బాపిరెడ్డి, భాస్కరమ్మ దంపతులు ఏర్పరిచారు. ట్రాక్టర్‌ చోరీ కేసులో నిందితుడి అరెస్టు

తోట్లవల్లూరు: ట్రాక్టర్‌ చోరీ కేసులో నిందితుడిని పోలీసులు తోట్లవల్లూరులో అరెస్టు చేశారు. పమిడిముక్కల సీఐ వై.చిట్టిబాబు చోరీ ఘటన వివరాలను మంగళవారం మీడియాకు తెలియజేశారు. మండలంలోని రొయ్యూరుకు చెందిన వల్లూరు శ్రీనివాసరావు తన ట్రాక్టర్‌ను ట్రక్కుతో సహా గ్రామ సచివాలయం వద్ద ఈ నెల 14వ తేదీ రాత్రి నిలిపి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు వచ్చి చూసే సరికి ట్రాక్టర్‌ కనిపించలేదు. దీనిపై ట్రాక్టర్‌ యజమాని శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కిషోర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల 25న దేవరపల్లి శివారు పొట్టిదిబ్బలంక రోడ్డులో ట్రాక్టర్‌ను గుర్తించి స్వాధీనం చేసుకోవడంతోపాటు ట్రాక్టర్‌ అపహరణకు పాల్పడిన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పేరుకలపూడి గ్రామానికి చెందిన మైల గణేష్‌ను అరెస్టు చేసినట్లు సీఐ చిట్టిబాబు తెలియజేశారు. చోరీకి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీన పరుచుకున్నామన్నారు. ఆ వాహనం కూడా గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో చోరీ చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుడిని గుడివాడ కోర్టులో హాజరు పరచగా న్యాయాధికారి 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు చిట్టిబాబు చెప్పారు. కేసు ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు అభినందించినట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement